సీఎం కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ వలన ఎమ్మెల్సీ కవితపై ఈ రకమైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది.
ఓ సండే బుక్ లోని పద వినోదం పూర్తి చేసిన కల్వకుంట్ల కవిత అందుకు సంబంధించిన ఫొటోను ‘ఐ గివ్ అప్’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఓ నెటిజన్ ఇలా స్పందించారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, ఉద్యోగస్తులు వేతనాలు రాక బాధపడుతుంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటే నాన్న గారు ఫార్మ్ హౌజ్ లో, అన్న గారు ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ లో మీరేమో ఉల్లాసంగా పద వినోదం పూరిస్తున్నారు. ప్రజలు ఏమైపోతే మీకేంటీ’ అని ట్వీట్ చేశారు.
‘కల్లాల్లో వడ్లు కొనక రైతులు అవస్థలు పడుతుంటే..తండ్రేమో రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతాడు..అన్నేమో దేశాలు తిరుగుతాడు. చెల్లేమో ఆట్లో బిజీగా ఉంది. మీ వల్ల రాష్ట్రానికి ఏం లాభం?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అలా కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.