బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు చేసుకుంటున్న ప్రచారంపై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. తెలంగాణ సాంస్కృతిక సంపద అయినటువంటి బతుకమ్మ పండుగను… మేమే కనిపెట్టాం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ మహిళల గుర్తింపు. అంతేకానీ… తెలంగాణ ఉద్యమాన్ని ముడివేసుకొని… కవితతోనే విశ్వవ్యాప్తం అయింది అని ప్రచారం చేసుకోవటం నిస్సందేహాంగా సిగ్గుపడాల్సిన అంశం అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తెలంగాణ వచ్చాక ఎంపీగా కవిత ఊరూరు తిరిగినా, ఉద్యమంలో జాగృతి పేరుతో జిల్లాలు తిరిగినా… ఒక భాగమే కానీ, మొత్తం ఆమె వల్లే అంటే జనం నవ్వుతున్నారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. బహుజన బతుకమ్మతో విమలక్క కూడా ఎంతో తిరిగిందని, ఆట-పాటతో అలరించిందని విమర్శిస్తున్నారు.
అంతటితో సరిపెట్టక నాడు ఇందిరా గాంధీ, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీలు కూడా తెలంగాణ బతుకమ్మ ఎత్తి… తెలంగాణ పట్ల, తెలంగాణ మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని… ఈనాడు మేమే చేశాం అని చెప్పుకుంటున్న చరిత్ర ఎప్పుడో విశ్వవ్యాప్తం అయిందని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.