విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు. దిల్ రాజు హంగామా చేస్తున్నాడంతే. ప్రేక్షకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి టైమ్ లో ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేయాల్సిన బాధ్యత దిల్ రాజుపై ఉంది. ట్రైలర్ బాగుంటే, ఆటోమేటిగ్గా అందరిచూపు వారసుడిపై పడుతుంది.
ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ రానే వచ్చింది. అయితే ఆ ట్రైలర్ అంచనాల్ని పెంచేలా కాకుండా, అందరితో తిట్లు తినేలా ఉంది.
అవును.. వారసుడు ట్రైలర్ లో ప్రతి సన్నివేశం ఓ తెలుగు సినిమాను గుర్తుకుతెచ్చింది. ఓ సీన్ చూస్తే అజ్ఞాతవాసి, మరో సీన్ చూస్తే బ్రహ్మోత్సవం, ఇంకోసీన్ చూస్తే అల వైకుంఠపురములో, మరో సన్నివేశం చూస్తే శ్రీమంతుడు.. ఇలా తెలుగు సినిమాల్ని కాపీ కొట్టి ఈ సినిమా తీశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో వారసుడు ట్రైలర్ పై తిట్ల దండకం అందుకున్నాడు నెజిటన్లు. ఇంతోటి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన థియేటర్లు బ్లాక్ చేసి, చిరంజీవి-బాలకృష్ణ సినిమాల్ని ఇబ్బందిపెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు.