గతంలో ఓ మాట జారినా.. వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చిన్న మాట నోరు జారినా… ఇక అంతే సంగతులు. ముఖ్యంగా సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా… ట్రోల్స్ మొదలైపోతాయి.
తాజాగా టీడీపీ ఎంపీ గల్లాపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ మిథున్ రెడ్డికి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేలా చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ సర్కార్‌పై కామెంట్స్ చేస్తూ… ఫ్రాంకిన్‌టెంప్లేటన్ కంపెనీపై వైసీపీ తీరును ఎండగట్టారు. దీనిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ… మీ తలపై జుట్టే లేదనుకున్నా, మీకు బుర్ర కూడా లేదని అర్థమవుతోందంటూ కామెంట్ చేశారు.
అంతే… సోషల్ మీడియా ఎంపీ మిథున్ రెడ్డిని మామాలుగా ట్రోల్ చేయటం లేదు. బొచ్చుదేముందిలే అన్న అవసరం ఉన్నా లేకున్నా పెరుగుతుంది… నీలా బుద్ది పెరగకపోతే కదా అసలు ఇబ్బంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ మిథున్ రెడ్డి ఫోటో పెట్టి ఎలా పుట్టావు అన్న ఇంత అందంగా అంటూ కామెంట్ చేశారు.
Advertisements
ఇప్పుడీ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరీ దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.