ఫ్యూచర్ సచిన్ గా కొందరు, చిచ్చర పిడుగంటూ మరికొందరు టీం ఇండియా ఆటగాడు పృథ్వీ షాను ఆకాశానికెత్తేవారు. కానీ ఇప్పుడా నోర్లే పృథ్వీ షాను తుర్పారబడుతున్నాయి. వరుసగా డకౌట్ అవుతూ… విమర్శకులకు పని చెబుతున్నాడు.
ప్రాక్టీసు మ్యాచులో అదరగొట్టిన శుభమన్ గిల్ ను కాదని… పృథ్వీ షాకు అవకాశం ఇచ్చారు. ఇన్ ఫాం బ్యాట్స్ మన్ రాహుల్ ను కూడా కాదని ఫ్యూచర్ స్టార్ అవుతాడని పృథ్వీకి వరుసగా అవకాశం ఇస్తున్నారు. కానీ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అడిలైడ్ పింక్ టెస్టులో షా మరోసారి నిరాశపర్చాడు. మరోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో పృథ్వీని సోషల్ మీడియా ఆటాడుకుంటుంది.
పృథ్వీ నీకు అవకాశాలు దండగా… పోయి ఇంట్లో కూర్చో అంటూ మండిపడుతున్నారు. నీ ఆటతీరు ఇక మార్చుకోవా… ఎందుకు ఈసారు ఇంకా అవకాశం ఇస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.