శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్ ఫేస్ సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు.

ఆ ప్రాంతంలో నిరసనకారులు వేసిన టెంట్లను ఆర్మీ తొలగించింది. దీంతో నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఓ జర్నలిస్టులపైనా పోలీసులు దాడి చేశారు. అతని దగ్గర నుంచి మొబైల్, కెమెరాలను పోలీసులు లాక్కున్నారు. అందులో ఉన్న వీడియోలు వారు డిలీట్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే నిరసనకారులపై పోలీసులు, సైన్యం తీవ్రంగా విరుచుకుపడటం గమనార్హం.