వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సేవ్యానాయక్ అనే టీఆర్ఎస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో తనపై రామ్మోహన్ రెడ్డి నిందలు వేశాడంటూ సేవ్యాన్యాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓ టీవీ చానల్ డిబెట్లో తన పేరును రామ్మోహన్ రెడ్డి నేరుగా ప్రస్తావించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో వారే కారు తగులబెట్టుకొని తనపై నిందలు మోపుతున్నారని ఆరోపించాడు.
గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. అయితే.. వైద్య పరిక్షలకు సేవ్యానాయక్ సహకరించలేదు. దీంతో వైద్యానికి ఆలస్యం అయింది.
సరైన సమయంతో వైద్యం అందకపోవడంతో.. అతడి పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితున్ని పలువురు టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.