ఖమ్మం జిల్లా పాలేరు లో అధికార టిఆర్ఎస్ లో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. కూసుమంచి లో ఎమ్మెల్యే కందాళకు చెందిన ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. మండల కమిటీల సందర్భంగా జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది.
ఎమ్మెల్యే కందాళ వర్గంలోని ఇరు వర్గాల నాయకులు,కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగింది. అనంతరం ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరకొట్టడం తో వివాదం సద్దుమణిగింది.