అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. బీజేపీ నేతలు భిక్షమెత్తుకుంటున్నారని, మన ఊర్లో రాముడు లేడా… ఎందుకు మనం విరాళాలివ్వాలంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కామెంట్ చేశాడు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.
రామనిధి కోసం ఎవర్నీ ఒత్తిడి చేయటం లేదని, అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నదే తమ తపన అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మెట్ పల్లిలో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగగా, టీఆర్ఎస్ నేతలు ప్రతి స్పందించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.