తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినప్పటికీ వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా తెరాస పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పడం ఖాయమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో జరిగిన నాలుగో రోజు ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు.
స్థానిక ఎమ్మెల్యే ల్యాండ్, ఇసుక, రైస్ మాఫియాకు కేంద్రంగా మారారని ఆరోపించారు. బీజేపీ భరోసా యాత్రను చూసి భయపడి.. కొత్త మండలాలను కేసీఆర్ సర్కారు ప్రకటించిందని చెప్పారు.
ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ యాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పతనాన్ని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం ఈ యాత్ర ద్వారా తెలుస్తోందన్నారు.