గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కొత్త మేయర్ ఎన్నికకు ఇంకాస్త సమయం ఉందంటూ ఫిబ్రవరి వరకు ఎన్నికను పొడగించగా… మేయర్ పీఠానికి సరిపడా కార్పోరేటర్లు గెలవని టీఆరెఎస్ కొత్త దారులు వెతుకుతుంది. అందులో భాగంగా కొత్త ప్రచారం స్టార్ట్ అయ్యింది.
ఎక్స్ అఫిషియో ఓట్లే వేసినా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం సొంతగా దక్కే ఛాన్స్ లేదు. అలాగని బీజేపీకి ఆయుధం ఇచ్చేలా ఎంఐఎంతో నేరుగా జతకట్టలేదు. దీంతో టీఆర్ఎస్ ఎం చేస్తుంది అన్నది కీలకంగా మారింది. ఎంఐఎం భయటి నుండి మద్ధతు ఇస్తుందా అన్న చర్చ ఇన్ని రోజులు సాగింది.
అయితే, టీఆర్ఎస్ మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేటర్లు ఏ పార్టీకి చెందిన వారైనా సరే … మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు ఎక్కువ మంది మద్దతు తెలిపితే సరిపోతుందని భావిస్తుంది. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఉంటాయా అన్న ఆలోచనలు కూడా చేశారని తెలుస్తోంది. అంటే బీజేపీ కార్పోరేటర్ల తెర వెనుక మంత్రాంగం జరిపి మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా రహాస్య ఓటింగ్ లేదా ముజువాణి ఓట్లతో ఎంఐఎం అండతో బయటపడాలని ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తోంది. ఇలా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరిగితే ఎవరి సహాయంతో గెలిచారన్న అంశం బయటపడదు. టీఆర్ఎస్ కు రాజకీయమైన చిక్కులు ఉండవని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు ఎంఐఎం సంపూర్ణ మద్ధతు తెలపాల్సి ఉంది.
ఇప్పటికే తమ కార్పోరేటర్లకు గాలం వేస్తున్నారని బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తుంది. మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ కు అధిక సమయం ఇచ్చేందుకే ఎన్నికల సంఘం ఎన్నిక పెట్టటం లేదంటూ మండిపడుతున్న సమయంలో… టీఆర్ఎస్ ఆలోచనలు బీజేపీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.