కరీంనగర్‌లో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్-రామగుండంలో కేంద్ర మంత్రి సదానందగౌడ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని నినాదాలు చేయగా బీజేపీ కార్యకర్తలు పోటీ నినాదాలు చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో సదానందగౌడ ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడి సర్ధిచెప్పటంతో గొడవ సద్ధుమణిగింది.