వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలిరౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు.16,130 ఓట్లతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలిస్థానంలో ఉన్నారు. ఇక ఆయనకు గట్టి పోటీనిచ్చిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న12,046 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఇక 9,080 ఓట్లతో తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొ. కోదండరాం మూడో స్థానంలో, 6,615 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి నాలుగోస్థానంలో, 4,354 ఓట్లతో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాములునాయక్ ఐదో స్థానంలో, 1,123 ఓట్లతో రాణిరుద్రమరెడ్డి ఆరో స్థానంలో, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్ ఏడో స్థానంలో, 1,008 ఓట్లతో జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.
ఫస్ట్ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప ఇండిపెండెంట్ ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న కన్నా 4084 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొత్తం 3,85,996 ఓట్లు పోల్ కాగా, ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున..ఏడు రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. తొలిరౌండ్‌లో 56,003 ఓట్లను లెక్కించగా.., 3,151 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.