ఉప్పల్ చిలుకానగర్ లో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్ భర్త దౌర్జన్యం చేశారు. స్థానికులపై అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించారు. బన్నాల ప్రవీణ్ తన అనుచరులతో వెళ్లి రౌడీ వీరంగం సృష్టించాడు. చిలకనగర్ లోని శ్రీనివాస హైట్స్ వాసుల నివాసాలకు ప్రవీణ్ గుండాలతో వెళ్లి దాడి చేసి అక్కడ హంగామా సృష్టించాడు.
దీంతో శ్రీనివాస హైట్స్ నివాసితులంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు కార్పొరేటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎందుకు దాడి చేశారో తెలియకుండా కొట్టారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ‌్‌లో రికార్డైన దృశ్యాల్ని పోలీసులు పరిశీలించారు. అయితే గతంలో కూడా కార్పొరేటర్ భర్త ప్రవీణ్ పై పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
గతంలో జైలుకు కూడా వెళ్లొచ్చారని, అధికారం రాగానే దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.