హైదరాబాద్ : ‘హుజూర్‌నగర్ బరిలో నిలబడతాం, కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు వివరిస్తాం…’ అంటూ నామినేషన్‌కు రెడీ అయిన సర్పంచుల సంఘం వ్యవస్థాపక అద్యక్షుడు భూమన్న యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ వార్త దావనంలా వ్యాపించటంతో సర్కార్, పోలీసులు కొత్త ఎత్తుగడ వేశారు.
పోలీసులు అరెస్ట్ చేసినందుకు చూపిస్తున్న కారణం మాత్రం వేరుగా ఉంది. భూమన్న యాదవ్ నిర్మల్ జిల్లా వాసి. ఆయన సచివాలయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, డబ్బులు వసూలు చేశారని అదుపులోకి తీసుకున్నారు. భూమన్న యాదవ్‌ను నిర్మల్‌లో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి భూమన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు.