రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఓచోట టీఆర్ఎస్ నేతలు, వాళ్ల చుట్టాల కబ్జా కథ ఏదో ఒకటి బయటకొస్తూనే ఉంది. తాజాగా మల్కాజిగిరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ కబ్జా బాగోతం వెలుగుచూసింది. బీజేఆర్ నగర్ సర్వేనెంబర్ 348లోని ప్లాట్ నెంబర్ 46లోని 85 గజాల తమ స్థలాన్ని కబ్జా చేయడానికి ఏడో డివిజన్ కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి మామ వెంకన్న కుట్ర పన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
ముందుగా.. ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే రూ.1.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడని చెబుతున్నారు బాధితులు. ప్లాటు కాగితాలు తెమ్మని ఒత్తిడి చేసి.. తర్వాత తాము కట్టుకున్న ఇంటిని అధికారులతో కూలగొట్టించి స్థలం తనదంటూ దౌర్జన్యానికి దిగాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు, మేయర్, డిప్యూటీ మేయర్ కు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు.