జీహెచ్ఎంసీలో అధికార పార్టీ కార్పొరేటర్ల అరాచకం మళ్లీ మొదలైంది. గ్రేటర్‌లో కొత్త పాలకమండలి ఏర్పడి రెండు నెలలు గడిచాయో లేదో తమ నిజస్వరూపం మళ్లీ బయటపెడుతున్నారు. తాజాగా TRS కార్పొరేటర్ విజయారెడ్డి మౌలాలిలో హల్‌చల్ చేశారు. ఓ భూ వివాదంలో హంగామా సృష్టించారు.తన అనుచరులను వెంటపెట్టుకొని వెళ్లి స్థానికంగా నిర్మాణంలో ఉన్న ప్రదేశంలోని రేకులను కూలగొట్టారు.
వీడియో తీయబోయిన రిపోర్టర్లపై విరుచుకుపడ్డారు. వారి నుంచి మైక్, కెమెరా లాక్కునేందుకు ప్రయత్నించారు. వీడియో తీయడం లేదని చెప్పినా వినకుండా జులుం ప్రదర్శించారు.
విజయారెడ్డి హల్ చల్ చేసిన దృశ్యాలివే..