మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కమ్మ సంఘం వన సమారాధనలో పాల్గొన్న ఆయన.. ఓ ప్రణాళిక చేపట్టి… ఏపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు అంబటి రాంబాబు వంటి వాళ్లను భౌతికంగా లేపేయాలని.. దానికోసం 50 లక్షల ఆర్థిక సాయం చేస్తానని అన్నారు.
వీడియోలో ఉన్న మాటలు
“2004 తర్వాత టీడీపీ ఓడిపోయిన తర్వాత పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడం కోసం ఆనాటి పాలకులు మొద్దు శ్రీను అనే క్రిమినల్‌ని పెట్టి ఓ ఆపరేషన్ స్టార్ట్ చేసి పరిటాల రవిని హత్య చేయడం జరిగింది. సమయం ఆసన్నమైంది. మనల్ని మనం ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. కులంలో ఉన్న కొన్ని చీడపురుగులు కొడాలి నాని, వల్లభనేని వంశీ.. అలాంటోళ్లే కాకుండా మదపటేనుగుల మాదిరి వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు.. ఇలాంటి వాళ్లను మనం కూడా ఒక ఆపరేషన్ నిర్వహించి భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దాని కోసం అవసరమైతే.. అటువంటి ప్రాజెక్టును ఎవరైనా చేపడితే.. ఈ వేదిక నుంచి నా వంతుగా రూ.50లక్షలు ప్రకటిస్తున్నా. ఎందుకంటే మొన్న జరిగిన క్యారెక్టర్ అసాసినేషన్ మామూలుది కాదు. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది”