హుజురాబాద్ లో ఎలాగైనా ఈటలను ఓడించి తీరాలన్న కసితో ఉంది టీఆర్ఎస్. ఇప్పటికే రెండు నెలలుగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. కొందరు ఎమ్మెల్యేలను అక్కడికి పంపింది. అయితే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆలస్యం అవుతుండటంతో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్ మినహా ఇతర నేతలు ఫోకస్ తగ్గించారు.
కానీ, టీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా షాకిచ్చేలా సడన్ గా నోటిఫికేషన్ వచ్చేసింది. నెల రోజుల్లో ఎన్నికకు కోడ్ కూసింది. దీంతో టీఆర్ఎస్ తన ప్లానింగ్ కు మెరుగులు దిద్దుతున్నారు.
టీఆర్ఎస్ ప్లానింగ్ ఇదే?
– ప్రతి 50మంది ఓటర్లకో ఇంచార్జ్…. గ్రామానికో రాష్ట్రస్థాయి నేతకు బాధ్యతలు
-మండలానికి ఒక మంత్రికి ఇంచార్జ్ బాధ్యతలు… మండలంలో ఉన్న గ్రామాలను, స్థానిక బలాబలాలను బట్టి ఎమ్మెల్యేలకు గ్రామాల బాధ్యతలు
– ప్రతి మూడు మండలాలకు సీనియర్ మంత్రులకు బాధ్యతలు
– టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ మొత్తం హుజురాబాద్ కు షిఫ్ట్… అక్కడి నుండే వర్క్, మానిటరింగ్
– టీఆరెఎస్ అభ్యర్థికి మద్ధతుగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు, కళాకారులతో ఇంటింటి ప్రచారాలు
– ఉప ఎన్నిక అంతా మంత్రి హరీష్ రావు చేతుల్లో
-దసరా తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభ