ప్రస్తుత సచివాలయం శిథిలావస్థకు చేరటంతోనే కొత్త సచివాలయం నిర్మించేందుకు ప్రస్తుత భవనాలను కూల్చివేయబోతున్నట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన టెక్నికల్ కమిటీ రిపోర్ట్‌ను కోర్ట్‌కు సమర్పించింది. అయితే, ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్ బ్లాక్‌ను కూడా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే, విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదించటంతో… తాము ఎలా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలో పిటిషనర్ తెలపాలంటూ కోర్ట్ ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.