నర్శింహారెడ్డి, జర్నలిస్ట్
పైసల్లేవ్..పైసల్లేవ్… పైసల్లేవ్..
తెలంగాణ జనం ఉదయాన్నే లేస్తూ మొదట వింటున్న మాట ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్.
ఏవండి గురుకుల స్కూల్‌లో చదువుతున్న మన అబ్బాయికి యూనిఫార్మ్ లేదట
అవునే సారును అడిగిన. ప్రభుత్వం దగ్గర పైసళ్ళేవట. అందుకే ఇవ్వలేదట.
నాన్నా.. మాకు ఈసారి 15th ఆగస్ట్ రోజు చాక్లేట్ కూడా ఇవ్వలేదు. మా సార్‌ని అడిగితే కూడా గిదే అన్నడు ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్ అని.
ఏమె.. నీవు ఆశ కార్యకర్తవు కదా జీతం వచ్చిందా
లేదండీ, మాకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్ అట
అరె, ఎట్లా మరి మన పక్కింటి వాళ్లకు కల్యాణలక్ష్మీ కింద పైసల్ వచ్చినవి కదా, వాళ్ళను కాస్త అప్పు అడుగు వెళ్లి,..
మీరు చెప్పేకంటే ముందే అడిగినా.. వాళ్లకు కళ్యాణలక్ష్మీ కింద రావాల్సిన చెక్ రాలేదట. MRO సార్‌ని అడిగితే ప్రభుత్వం దగ్గరా పైసల్లేవ్ అని చెప్పిండట, వాళ్ళ పెద్దమ్మాయికి కేసీఆర్ కిట్ కూడా రాలేదట, కేసీఆర్ కిట్ కూడా కేసీఆర్ దగ్గర పైసళ్ళేవట అండీ..
అవునా, మరి ఇప్పుడెట్లనే. మీరు పోయి సావుకరిని అడగండి. మొన్ననే రోడ్డు వేసిండు కదా. పైసలు ఉంటాయి.
సరే, అడిగొస్తానే. షావుకారు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, ఈయ్యే.. పంట అమ్మినాక ఇస్తా,
పో ఎల్లన్నా.. పైసల్లేక ఇంట్లో నుంచి బయటకు వస్థలేదు, ఉన్నది అంతా పెట్టి ఊళ్ళో రోడ్లు ఎసినా కదా, ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాకపాయే, ఏంది సారూ అని పోయి mlaని అడిగితే ఏడికెళ్లి ఇయ్యాలి, ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్ అంటుండు.
అయ్యో గా రైతు బంధు కింద వచ్చినవి ఉంటే నన్న ఇయ్యి సారు, రైతుబంధు లేదు ఏది లేదు. అదికూడా రూపాయి కూడా రాలేదు, గా బ్యాంక్ సారును అడిగితే రైతు బంధు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్ అంటుండు.
అవును సారు మొన్న మన రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే 108 రాకపోయే ఏంది అని అడిగితే వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి పైసళ్ళేవట, గాడిదాక పోయినవ్ ఎల్లన్న మా ఇంట్లో ఆమె anmగా చేస్తుంది, 10 నెలలనుంచి జీతాల్లేవ్ ఏంది అని అడిగితే ప్రభుత్వం దగ్గర పైసళ్ళేవట,.
అవును షావుకారూ.. కారు గుర్తుకు ఓటేస్తే డబుల్ బెడ్రమ్ ఇస్తారు అనుకోని ఓటేస్తిమి , వానలు పడుతున్నాయి గుడిసెలో ఉండలేక పోతున్నాం, గా పంచాయతీ సెక్రెటరీని అడిగితే మాకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైజల్లేవు, 3 నెలలుగా జీతాలు లేవు ఇక నీ ఇంటికి ప్రభుత్వం దగ్గర పైసలు ఏడున్నాయి అంటుండు.
గా పొసమ్మ పని బాగుంది. ఆశ కార్యకర్త నెల నెలా జీతం వస్తుంది.
ఓ ఎల్లన్న గట్ల అనకే మాకు కూడా జీతాలు లేవు , ప్రభుత్వం దగ్గర మాకు జీతాలు ఇవ్వడానికి పైసళ్ళేవట, గా జీతం రాలేదనే మా ముసల్లోని పానం బాగలేకుంటే ఉస్మానియా ఆసుపత్రి తీసుకపోయిన, వామ్మో అదేంది ఎల్లన్న ఆసుపత్రి గట్లుంది..
ఏమైంది పొసమ్మా?
కంపు వాసన, బిల్డింగ్ పైనుంచి మన్ను పడుతుంది, ఎప్పుడు కూలిపోతుందో అని భయపడ్డా. నరకంలో ఉన్నట్లు అనిపించింది, ఆ డాక్టర్ సార్ ని అడిగిన ఏంది సారు జర మంచిగా చెపియ్యాలి కదా అని దానికి కూడా ప్రభుత్వం దగ్గర పైసళ్ళేవాట,
బిల్డింగ్ దాకా పోయినవ్ పొసమ్మా.. మీ ముసల్లోనికి మందులు ఇద్దాం అన్న అవికూడా లేవు, వాటికి కూడా ప్రభుత్వం దగ్గర పైసళ్ళేవు అని డాక్టర్ సారు అంటుండు, గా తాండల స్కూల్ చెప్తున్న న కొడుకుకు కూడా జీతాలు రాలేదు విద్య వలంటీర్ల కు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర పైసల్లేవట, అగు పొసమ్మ గా టికేఆర్ సారు పోతుండు ,మిషన్ భగీరత మన ఊళ్ళో సగం చేసి వదిలేసిండు అడుగుదాం,
ఓ టికేఆర్ సారు మిషన్ భగీరత సగం లో వదిలేసినవ్ ఏంది,
ఏ ఉకో ఎల్లన్న చేసినపనికే ప్రభుత్వం పైసాల్ ఇవ్వలే, ఇంకా మొత్తం ఎడికెళ్లి ఎయ్యాలి,
మీకు కూడా బిల్ రాలేదా సారు,
లేదు ఎల్లన్న ప్రభుత్వం దగ్గర పైసళ్ళేవట.
గదెంది షావుకారు మనది పైసాల్ ఉన్న రాష్ట్రం కదా మరి గిదేంది.
ఆవు నాకు కూడా గదె అనుమానం ఎల్లన్నా.. పైగా వందల కోట్లు పెట్టి కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయం ఇంకా మన ముఖ్యమంత్రి సారు చాలా చేస్తా అంటుండు, వాటికి ఏడ వచ్చినవి పైసాల్, మనకేం తెలుసు. మన ఊర్లో గా గులాబీ తోట చంద్రశేఖర్ సారు ఉన్నాడు. ఆ సారుకు అన్ని తెలుస్తాయి పోయి అడుగుదాం పదండి.
ఓ చంద్రశేఖర్ సారూ..
చెప్పు ఎల్లమ్మ పొద్దున్నే అందరూ గిట్ల వచిండ్రు.
ఏమి లేదు సారు, కేసీఆర్ కిట్టుకు పైసల్లేవ్, కల్యాణ లక్ష్మికి పైసల్లేవ్, డబుల్ బెడ్రమ్ కు పైసల్లేవ్, ఊళ్ళో రోడ్లకు పైసల్లేవ్, మిషన్ భగీరత కు పైసల్లేవ్, ఆశ కార్యకర్తల జీతాలకు పైసల్లేవ్, విద్యావలంటీర్ల జీతాలకు పైసల్లేవ్, పంచాయతీ సెక్రయారీ జీతాలకు పైసల్లేవ్, ఆసుపత్రిలు మంచిగా చేయనింకే పైసల్లేవ్, మందులకు పైసల్లేవ్, రైతు బంధుకు పైసల్లేవ్, 108 వాళ్ళ జీతాలకు పైసల్లేవ్, ANM కార్యకర్తల జీతాలకు పైసల్లేవ్, పిల్లలకు బట్టలు పైసల్లేవ్, చివరకు జెండావందనం రోజు పిల్లలకు చకోలేట్ కూడా పైసల్లేవ్ అంటుండ్రు కదా.. మరి గా వందల కోట్లు పెట్టి గా బిల్డింగ్ లు ఎందుకు కడుతుండ్రు సారు, అయిన మన రాష్ట్రంలో మాస్త్ పైసాల్ కదా గవన్నీ ఎడికి పోయినవి, అప్పులు కూడా శాన అయినవి అంటుండ్రు గా పైసాల్ అన్ని ఎడికి పోయినవి చంద్రశేఖర్ సారు.
ఎడికి పోయినవి తెలంగాణ లో బాగా వానలు పడుతున్నాయి కదా పైసల్ అన్ని తడిచి పాడైపోతాయి అని గా చంద్ర మండలం మీద దాచి పెట్టి వానలు తగ్గినకా తెచ్చుకుందాం అని గా విక్రమ్ లో పెట్టి పంపినం గదేమో కనబడకుండా పాయే ఏంచేయాలి చెప్పుండ్రి.
ఏంది పొసమ్మ నేత్రి మీద చేతులు పెట్టుకుంటివి, విక్రమ్ ఏంటి, చంద్రుడేంటి, ఆ విక్రమ్ ఎప్పుడు దొరకాలి మన పైసాల్ మనకు ఎప్పుడు రావాలి ఎమ్ అర్థం అయితలే,
ఇప్పుడు ఎమ్ చేద్దాం సారు, చంద్రుడు ఎక్కడ అష్టమిస్తాడు ఎల్లన్న తూర్పుకు సారు అక్కడ తిరిగి దండం పెడుదాం ఎల్లన్న.