దుబ్బాక ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు ఇంకా టీఆర్ఎస్ ను వీడినట్లు కనపడటం లేదు. సిద్ధిపేటను ఆనుకొని ఉన్న నియోజకవర్గంలో తమకు ఎదురే లేదనుకుంటున్న టీఆర్ఎస్ కు ప్రజలు షాకిచ్చారు. బీజేపీని గెలిపించారు. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై పడింది.
దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో… టీఆర్ఎస్ చర్యలు ప్రారంభించింది. త్వరలో ఉప ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో సాగర్ లోని మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా వేశారు. వీరందరికీ మంత్రులను సమన్వయకర్తలుగా నియమించబోతున్నారు.
మండలానికో ఇంచార్జ్ నేతలు వీరే
తిరుమలగిరి-దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
అనుముల- రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్
పెద్దవూర- చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్
గుర్రంపోడ్- నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి
నిడమనూరు- మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
త్రిపురారం- మహాబుబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్,
హాలియా మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప,
సాగర్ మునిసిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు
వీరంతా ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లోనే ఉండి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ ఆదేశించింది.