టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయనపై భూఆక్రమణ ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. తాజగా ఓ గ్రామ సర్పంచ్‌ని రసమయి బండబూతులు తిడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తానే సర్పంచ్‌నే తిడుతూ.. సంస్కారంగా మాట్లాడాలని రసమయి సూచించడం విశేషంగా మారింది.
మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్.. తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని కరీంపేట సర్పంచ్ మల్లయ్య ఆరోపిస్తున్నాడు. తన ఇంటిచుట్టూ రౌడీలను మోహరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే విషయం గురించి అడిగేందుకు రసమయికి ఫోన్ చేస్తే.. తిరిగి తననే బెదిరించాడని బాధిత సర్పంచ్ వాపోయాడు. సొంత పార్టీ నేతే అక్రమానికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించాడు. తనకు మద్ధతుగా నిలిచాడన్న కోపంతో మరో మాజీ సర్పంచ్‌పై రసమయి దాడి చేయించారని మల్లయ్య ఆరోపించాడు. రసమయి బాలకిషన్ ఆగడాలు భరించలేకపోతున్నానని, అందుకే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాడు మల్లయ్య.