కెసిఆర్ మోసానికి బలైపోయిన! టీఆరెస్ కార్యకర్త ఆమరణ దీక్ష - Tolivelugu

కెసిఆర్ మోసానికి బలైపోయిన! టీఆరెస్ కార్యకర్త ఆమరణ దీక్ష


టీఆరెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుండి పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర ఆశించిన టీఆరెస్ నాయకుడు భీమా లక్ష్మణ్ ఆమరణ దీక్షకు దిగారు. ఆదివారం లక్ష్మణ్ తన దీక్షను ప్రారంభించారు . లక్ష్మణ్ తొలివెలుగు తో మాట్లాడుతూ దాదాపు 20సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశానని, ఉద్యోగాన్ని వదులుకొని కొన్ని కోట్ల రూపాయలు పార్టీ కోసం , తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చుపెట్టానని అయినా పార్టీలో కనీస మర్యాద లేదని ఆవేదన వ్యక్తం చేశారు . లక్ష్మణ్ దీక్ష ఇవాళ రెండో రోజుకు చేరుకుంది .

కరోనా వ్యాధి కంటే టీఆరెస్ పార్టీ భయంకరంగా తయారైందని చెప్పారు . నేనే కాదు చాలా మంది సీనియర్ నాయకులు ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారన్నారు . ప్రాణం పోయిన దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నారు .కెసిఆర్ స్పందించే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని పేర్కొన్నారు .లక్ష్మణ్ 2018 ఎన్నికలలో జనగాం నియోజకవర్గం నుండి టీఆరెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు .

Share on facebook
Share on twitter
Share on whatsapp