దుబ్బాక ఉప ఎన్నికలో కారును పోలిన రోటీ మేకర్ గుర్తుకు చెప్పుకోదగిన ఓట్లు పడటంతో టీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇకపై రాష్ట్రంలోని ఏదేని ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలిన గుర్తుల వల్ల తాము నష్టపోతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఈసీకి ఫిర్యాదుచేశారు.
కారును పోలి ఉన్న మరికొన్ని గుర్తులపై కూడా వినోద్ కుమార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వాటిని తొలగించాలని విజ్ఞప్తిచేశారు. కాగా ఇటీవల దుబ్బాక ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోటీ మేకర్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దానికి 3500లకుపైగా ఓట్లు పోలయ్యాయి. గతంలో కూడా రోడ్ రోలర్ గుర్తుతో నష్టపోతున్నామని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.