తండ్రి వయస్సు కూడా కాదు… తాత వయస్సున్న మన మాజీ ఉప ముఖ్యమంత్రి మనవరాలి వయస్సున్న బాలికతో ఓ ఫంక్షన్లో బోజనం తినిపించుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్లతో మాట్లాడుకుంటూ తాను ఓ రాజులా, మిగతా వారు ఆయన అనుచరుల్లా బిల్డప్ ఇస్తూ… ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది.
పుష్కలంగా, ఆరోగ్యంగా ఉన్న మన ఎమ్మెల్యే గారు రెండు చేతులు బాగానే పనిచేస్తున్నా బాలికతో తినిపించుకుంటూ, వచ్చిపోయే వారితో సరదా సంభాషణ చేస్తున్న వీడియోను చూసి జనం మండిపడుతున్నారు. రాజయ్య ఇక మారడు అంటూ కాస్తో కూస్తో రాజయ్య గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి చేష్టల వల్లే రాజయ్య పరిస్థితి డిప్యూటీ సీఎం నుండి ఎమ్మెల్యే స్థాయికి పడిపోయారని… ఇలాగే చేస్తే ఉన్న ఆ పదవి కూడా పోతుందని హెచ్చరిస్తున్నారు. నీ మనవరాలును కూడా ఎవరైనా ఇలాగే ట్రీట్ చేస్తే మీకు ఓకేనా అంటూ మరో కామెంట్ వినిపిస్తోంది.
Advertisements