నిర్మల్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. టీఆర్‌ఎస్‌కు చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు.
అలాగే సాజిద్ డ్రైవర్ జాఫర్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన అన్నపూర్ణ అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. సాజిద్‌పై ఐపీసీ 363 376 (2) 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మొదట బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించిన బాధితురాలు… నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపింది. వారి సహాయంతోనే శనివారం రాత్రి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ప్రాథమిక విచారణ అనంతరం బాలికపై అత్యాచారం జరిగిన విషయం నిజమేనని నిర్ధారణ కావటంతో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి సాజిద్ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసులు సాజిద్ ను అరెస్ట్ చేశారు.