సహకార సంఘం ఎన్నికల డైరెక్టర్ ఎన్నికలో నామినేషన్ ఉపసంహరించుకోలేదని దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటును చేసుకుంది. చిట్యాల సహకార సంఘం ఎన్నికల డైరెక్టర్ ఎన్నికలో 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి గా జలందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో జలందర్ రెడ్డి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని పలుమార్లు అధికార పార్టీకి చెందిన కొంత మంది హెచ్చరించారు. అయినప్పటికీ జలందర్ రెడ్డి నామినేషన్ ను ఉపసంహరించుకోలేదు. దీనితో జలందర్ రెడ్డి పై టిఆర్ఎస్ వర్గీయుల దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం జలందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నల్గొండ సురక్ష హాస్పిటల్ నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. బాధితుని స్టేట్మెంట్ తో ముగ్గురిపై అత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.