వైట్ ఛాలెంజ్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చినందుకు గన్‌పార్క్ అపవిత్రమైందంటూ.. గంగాజలంతో శుద్ధి చేసింది టీఆర్ఎస్. ఆ పార్టీ మహిళ కార్యకర్తలు, TRSV నేతలు అమరవీరుల స్థూపాన్ని పాలు, గంగాజలంతో కడిగారు. ఈ సందర్భంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి రాకతో అమరవీరుల స్థూపం అపవిత్రం అయ్యిందని, తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజూ పాల్గొనని రేవంత్ రెడ్డికి అమరవీరుల స్థూపం పరిసరాలలోకి వచ్చే అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ కంటే ముందు చంద్రబాబు, లోకేష్, రాహుల్ గాంధీ, కొండా విశ్వేశ్వరరెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయాలని డిమాడ్ చేశారు.