ఉద్యమ నోర్లేందుకు మూత పడ్డయ్..? - trs leaders harish rao and eatala rajender didnt responds on tsrtc employees strike - Tolivelugu

ఉద్యమ నోర్లేందుకు మూత పడ్డయ్..?

తెలంగాణ లో మరో ఉద్యమం మొదలైంది, ప్రభుత్వ సన్నిహితులు మినహా అందరూ ఆర్టీసీ ఉద్యోగులకు బాసటగా నిలబడుతున్నారు, తెలంగాణ మొత్తం లో ఆ ఇద్దరు మాత్రం ఎటు కామెంట్ చేయడం లేదు, కీలక పదవుల్లో ఆ ఇద్దరు నేతలు అసలు అడ్రెస్ లేకుండా పోయారు, జరుగుతున్నది తమ మంచుకె అన్నట్లు ఆ ఇద్దరి నేతల ఆలోచనగా కనిపిస్తుంది.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తోంది, రోజు రోజు కు సమ్మె తీవ్రత పెరుగుతుంది, ఒక పక్క ప్రభుత్వం మరో పక్క ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ప్రకటనలు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మంత్రులు వరుసగా ఉద్యోగ సంఘాల నాయకులపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ లోని ప్రతిఒక్కరు జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతున్నారు.

తెలంగాణ ఇంత జరుగుతున్నా ఆ ఇద్దరు మాత్రం మాకు ఏ సంబంధం లేదు అన్నట్లు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం లో మంత్రులుగా ఉన్న ఆ ఇద్దరు నేతల ఆచూకీ లేకుండా పోయింది. ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు, తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాల ను ఏకం చేసిన సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరూ అసలు తెలంగాణ లో ఉన్నారా లేదా అనే అనుమానం కలుగుతోంది.

ప్రభుత్వానికి కానీ, టిఆర్ఎస్ పార్టీ కి కానీ ఏ చిన్న సమస్య వచ్చిన ట్రబుల్ షూటర్ హరీష్ ముందుండి దాన్ని పరిష్కరించే వారు, ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. గౌరవాధ్యక్షుడు అయివుండి కూడా సమ్మె పై హరీష్ స్పందించలేదు, ఈటెల రాజేందర్ ఉద్యోగులతో, ఉద్యోగ సంఘాల నేతలతో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉండే వారు, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం లో మాత్రం ఈటెల రాజేందర్ కనీసం స్పందించలేదు. సమ్మె విషయంలో మంత్రులు స్పందించాలి అని సీఎం చెప్పిన కూడా ఆ ఇద్దరు మాత్రం నోరు విప్పడం లేదు.

మంత్రులు అందరూ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఎదురుదాడి చేస్తున్నారు, ఆ ఇద్దరు మంత్రులు సైలెంట్ గా ఉండడం పై గులాబీ పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె న్యాయమైందే అన్న ఆలోచనలో ఆ ఇద్దరు మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది, అనవసరంగా సీఎం ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు, అనవసరంగా ఈ ఉద్యోగులు తో వైరం మాకెందుకు అని ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు.

సమస్య జఠిలం అవుతుంది మీరు ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడండి అని ఎవరైనా అంటే సీఎం మమ్మల్ని దూరంగా ఉంచారు, ఇప్పుడు కూడా మా అవసరం ఏముంది లే అంత కేసీఆర్ శిష్హులు చూసుకుంటారు అని వెటకారంగా సెటైర్లు వేస్తున్నారట ఆ ఇద్దరు మంత్రులు.

Share on facebook
Share on twitter
Share on whatsapp