అధికార టీఆరెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరులు జోరుగా సాగుతున్నాయి. నేతలు పైకి గుంభనంగా కనిపిసున్నప్పటికీ ఏదో ఒక సమయంలో వారి మధ్య విబేధాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఇటీవల మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో జరిగిన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ధిక మంత్రి హరీష్ రావు, మంత్రి మల్లారెడ్డితో పాటు పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేదికపైనే మంత్రి మల్లా రెడ్డి-మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.గత కొంత కాలంగా మంత్రి మల్లారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు. చాలా సందర్భాల్లో వీరు బాహోటంగానే విమర్శలకు దిగారు.