టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఇంకా భగ్గుమంటునే ఉన్నాయి. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో తమకు అన్యాయం చేసి… సత్యవతి రాథోడ్ ను మంత్రిని చేయటం పట్ల సీనీయర్ నేత రెడ్యానాయక్, ఎంపీ కవితలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో నేరుగా కేటీఆర్ తోనే తమ అసంతృప్తి వెల్లడించగా… రెడ్యానాయక్ ను కేటీఆర్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. అందరికీ న్యాయం చేస్తామని… భవిష్యత్ లో మీకు ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ సముదాయించినట్లు సమాచారం.
ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా… జోగురామన్న, నాయిని, మైనంపల్లి, ఎమ్మెల్యే షకీల్, రాజయ్య, బాజిరెడ్డి లాంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా… కేటీఆర్ వారితో మాట్లాడి పరిస్థితిని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు.