చంపుతా.. కాళ్లు నరుకుతా.. రికార్డు చేసుకో.. అధికారంలో ఉన్నాం.. ఎక్కువ చేస్తే అడ్రస్ లేకుండా పోతవ్ బిడ్డా..ఇవీ జర్నలిస్టులపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల బరితెగింపు మాటలు. వ్యతిరేక వార్తలు రాసినందుకు మొన్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. ఓ జర్నలిస్టును కాళ్లు నరుకుతానంటూ చేసిన వ్యాఖ్యలు మరువకముందే.. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత స్థానిక జర్నలిస్ట్ నవీన్ పట్ల తన అధికార మదాన్ని ప్రదర్శించారు.
విచిత్రమేమిటంటే దుబ్బాక టీఆర్ఎస్ నేత జర్నలిస్టుపై రెచ్చిపోవడానికి కారణం.. తTRS Leaders Warns Journalistsనపై వ్యతిరేక వార్త రాసినందుకో.. తన గురించి మాట్లాడినందుకో కాదు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జర్నలిస్టును బెదరించిన ఆడియోను షేర్ చేసినందుకు ఉగ్రుడైపోయారు. టీఆర్ఎస్‌కి చెందిన ఏ ఎమ్మెల్యే, ఎంపీపై వ్యతిరేక వార్తలు రాసినా బాగోదని హెచ్చరించారు. రికార్డ్ చేసుకో.. చంపిపారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం గురించి మాట్లాడటానికి నువ్వెవరూ అంటూ బెదిరింపులకు దిగారు. మరో మూడేళ్లు ప్రభుత్వంలో ఉంటాం.. జాగ్రత్తగా ఉండాలంటూ మాట్లాడుకుంటూ పోయారు.