మెఘా ఇంటి వద్ద తెలంగాణ మంత్రి - Tolivelugu

మెఘా ఇంటి వద్ద తెలంగాణ మంత్రి

తెలంగాణ ప్రభుత్వానికి, మెఘా కృష్టారెడ్డికి ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో… అందరికీ తెలుసు. అయితే… మెఘా ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతోన్న సందర్భంలో కృష్ణారెడ్డి ఇంటి వద్దకు తెలంగాణ మంత్రి ఎందుకు వచ్చినట్లు…? కేసీఆర్‌కు అత్యంత సన్నిహిత నేత అక్కడకు ఎందుకు వెళ్లినట్లు…? మీడియాకు కనపడకుండా ఎందుకు ప్రయత్నించినట్లు…?

మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో మెఘా ఇంజనీరింగ్ సంస్థ అక్రమాలు, లావాదేవీలపై ఐటీ సోదాలు నడుస్తున్నాయి. రెండ్రోజులుగా ఐటీ అధికారులు నాన్‌-స్టాప్‌గా మెఘా కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయన కార్యాలయాలు, బ్యాంకు అకౌంట్లపై క్షుణ్ణంగా పరిశీలనలు కొనసాగుతూ ఉన్నాయి. సహాజంగానే మెఘా మీడియా ఈ ఇష్యూపై గప్‌-చుప్‌గా ఉంది. ఒకట్రెండు మీడియా హౌజ్‌ల ప్రతినిధులే మెఘా ఇంటి వద్ద ఉన్నారు.

అయితే, మీడియా అంత మనదే కదా… అనుకున్నారో ఏమో, తెలంగాణ మంత్రి… కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మంత్రి నిరంజన్‌ రెడ్డి మెఘా ఇంటి వద్ద మీడియా కంటపడ్డారు. ఎవరో ఇద్దరు వ్యక్తులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఎవరా ఇద్దరు అనేది బయటపడలేదు. కానీ మీడియాను చూడగానే… వేగంగా అక్కడి నుండి వెళ్లిపోవటం గమనార్హం. పైగా మెఘా ఇంటి చుట్టూ… రాష్ట్ర పోలీసుల గస్తీ కూడా ఉండటంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్ర పోలీసులకు సంబంధం లేని విషయంలో పోలీసులు ఎందుకు వచ్చినట్లు, మంత్రి ఎవరితో మంతనాలు జరిపారు… పైగా మెఘా ఇంటి వద్ద బందోబస్తుతో…? మెఘా ఇంట్లో నుండి ఏమైనా బయటకు వచ్చాయా…? ఇలా రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp