తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడగా.. తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా సోకింది. తాజాగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారు, తనతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు దయచేసి COVID-19 పరీక్ష చేసుకోవాలని కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. కరోనాతో నిన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,499కి చేరింది. ఇప్పటివరకు 2,69,828 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి.