ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికలు ఆ ఇద్దరి మంత్రులకు అగ్ని పరీక్షగా మారాయి. మున్సిపల్ అభ్యర్దులను గెలిపించుకునే ప్రయత్నంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నిమగ్నమైయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్దానాలను ఇద్దరు విభజించుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ రాజకీయలలోకి వచ్చి రెండు పర్యయాలు ఎమ్మేల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి పదవి పొందాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ హడవుడి అధికంగా వుంటుంది. కుల సంఘాలు కూడా చురుకుగా పనిచేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్ది మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యతను భుజాలపై వేసుకొని డి.కే. అరుణ పై గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను గెలుపించుకునే పరీక్షకు సిద్దమౌతున్నారు.
కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల బాధ్యత మంత్రి నిరంజన్ రెడ్డిపై ఉంది. ఈయనకు నాగర్ కర్నూల్ ఎం.పి అభ్యర్ది రాములు, ఎమ్మేల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుడి,ఎడమలుగా ఉన్నారు. వీరందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ ను గెలిపించాల్సిన బాధ్యత మంత్రి నిరంజన్ రెడ్డిపై ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆరెస్ పార్టీకి చెందినవారే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రులు టీఆరెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఓ వైపు టికెట్ దక్కని వారిని ఓదారుస్తూ మరోవైపు పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు.