టీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సైట్ డెవలప్మెంట్ ఇవ్వలేదని నెపంతో ఓ బిల్డర్ ను పలురకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘటన వెలుగు చూసింది. కొండాపూర్ లో 39 ఎకరాల 21.6 గుంటల స్థలంలో Narne constuction pvt lmt వారు లీగల్ గా అన్ని అనుమతులు పొంది వెంచర్ వేశారు. పార్క్ ఇతర స్థలాలకు కూడా కొంత స్థలాన్ని కేటాయించారు. ఇక ఇతర సౌకర్యాలకు సుమారు 3400 గజాల స్థలాన్ని వదిలిపెట్టారు.
అయితే, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కన్ను ఆ 3400 గజాల స్థలంపై పడింది. దీంతో బిల్డర్ అన్ని రకాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, బిల్డర్ లొంగకపోవడంతో.. అసోషియేషన్ వారితో కలిసి ఆ స్థలంలో మందిర నిర్మాణానికి తెరలేపారు. దీంతో, ఆ బిల్డర్.. అసోసియేషన్, ఎమ్మెల్యే పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.