విజయారెడ్డి కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి దందా? - Tolivelugu

విజయారెడ్డి కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి దందా?

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో టీఆరెఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉన్నట్లు స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. భూముల పాత పంచాయితీల్లో ఎమ్మెల్యే వేలు పెట్టారని, తాను పరిష్కారం చూపిస్తానని… ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 30లక్షలు వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

మొత్తం 412 ఎకారాల భూమి ఎప్పటి నుండో… వివాదాల్లో ఉందని, రైతులు కొనుకున్న భూమిపై పట్టాలు రావటం లేదన్న దాఖలాలు అనేకం ఉన్నట్లు గ్రామస్థులు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. రైతుల దగ్గర నుండి ఎమ్మెల్యే వసూలు చేశారని, సురేష్‌కు సంబంధించిన భూమి విషయంలో 3లక్షల వరకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 7 ఎకరాల భూమిపై ఈ పంచాయితీ నడుస్తోందని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. 1950వ సంవత్సరం నుండి ఈ పంచాయితీ ఉందని, ఏ ప్రభుత్వం ఉంటే…ఆ పార్టీ స్థానిక నేతలు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ సమస్యను జఠిలం చేశారని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు.

ఈ భూమి పక్కనే… కాంగ్రెస్ నేత మల్‌రెడ్డ రంగారెడ్డి భూమి కూడా ఉందని… ఈ 412 ఎకరాల భూమిలో ఎందరో రాజకీయ నేతలు ఉన్నట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

ఇదే విధంగా అంబర్‌పేటలో 402ఎకరాలు గ్రామస్థులు కొనుకున్నారని… మళ్లీ ఇప్పుడు కేసు నడుస్తోందని, ఈ కేసులో హోంమంత్రి మహమూద్ అలీ కొడుకు వెనుకుండి నడిపిస్తున్నారని స్థానిక నేతలు ఆరోపించారు.

హత్యకు సంబంధించిన భూమిపై గ్రామస్థుల ఫోన్ సంభాషణ ఇదే:

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందన ఇదే:

అయితే, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాత్రం సురేష్‌ ఎవరో తనకు తెలియదంటున్నారు. తన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది వచ్చిపోతుంటారని, విజయారెడ్డి హత్య దురదృష్టకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. విజయారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే.

Share on facebook
Share on twitter
Share on whatsapp