కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఇబ్రహీంపట్నం టీఆరెఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చేయించారని తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో చెప్పారు. నిందితుడు సురేష్ టీఆరెఎస్ కార్యకర్త అని, సురేష్ ను ప్రేరేపించి హత్య చేసేలా ఉసిగొలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంలో ఉన్న భూమికి సురేష్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం ఎమ్మార్వో విజయా రెడ్డి, కిషన్ రెడ్డి భూ కబ్జాలు అడ్డుకున్నందుకు హత్య చేయించారని ఆరోపించారు.