హైదరాబాద్: టీఆర్ఎస్‌లో విభేదాల పరంపర కొనసాగుతూనే ఉంది. సత్యవతి రాథోడ్‌కు మంత్రిపదవి ఇవ్వటం ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత నిన్న కేటీఆర్‌ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేయటంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పందించారు. పార్టీలోకి కొత్తగా వచ్చి పదవులు పొందిన వారే అలగటం ఏంటో తనకు అర్థం కావటం లేదని అన్నారు. ‘నేను వారికన్నా పార్టీ సీనీయర్‌ని.. పైగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నేతను ఓడించిన నాకు మంత్రి పదవి ఇవ్వాలి కదా’ అని తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తంచేశారు. ‘జిల్లాలో కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకి క్యాడర్ లేకుండా చేసింది నేనే’ అన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ పదవులు రాలేదని పోరాడుతున్న రెడ్యానాయక్, కవితలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.