టీఆరెఎస్ పార్టీ శ్రేణులు సహా దేశ వ్యాప్తంగా ఎన్‌కౌంటర్‌కు మద్దతుగా ప్రకటనలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కీర్తిస్తుంటే… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేశారు టీఆరెఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఎన్‌కౌంటర్ బాధకరమని, వారి తల్లితండ్రులు ఎంతో బాధపడి ఉంటారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మహిళా సంఘాలు, పౌరహక్కుల నేతలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ గొంగిడి సునీత కామెంట్ చేశారు. ఎన్‌కౌంటర్ బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.