దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ప్రైవేట్ హెల్త్ వర్కర్‌లకు కూడా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ (జగిత్యాల) వ్యాక్సిన్ తీసుకున్నారు. సంజయ్ అంతకుముందు వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఆయన టీకా వేయించుకున్నారు.
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా దాదాపుగా 5 వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 179 సెంటర్లను ఏర్పాటు చేశారు.తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 1.54 లక్షల మంది సిబ్బంది కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్నారు