అయోధ్య రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న TRS ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చివరికి వెనక్కు తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు హిందువులు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను కావాలని కొంతమంది వక్రీకరించారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తానూ హిందువునేననీ, తన ఇంట్లో కూడా సీతారాముల ప్రతిమలు ఉన్నాయనిఅన్నారు. రామ మందిర నిర్మాణం తామే చేపడుతున్నట్లు బీజేపీ అతిగా ప్రవర్తిస్తున్నందువల్లే.. తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. తమకు రసీదు పుస్తకాలు ఇస్తే, తాము కూడా విరాళాల సేకరణ చేస్తామని చెప్పుకొచ్చారు.
కాగా, నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ.. యూపీలో రామ మందిరానికి ఇక్కడ విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు విద్యాసాగర్ . మన ఊళ్ళల్లోనే రామాలయాలు కట్టుకుందామని పిలుపునిచ్చారు. విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో విద్యాసాగర్ రావు తన వ్యాఖ్యలపై క్లారిటీ వివరణ ఇచ్చారు.