హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి నామినేషన్ వేసేందుకు వెళ్లి వెనక్కి వచ్చేశారు. వెయ్యలేకపోయారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమెను నామినేషన్ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో అధికారులు వెనక్కి పంపారు. నాలుగు గంటల పాటు రిటర్నింగ్ కార్యాలయంలోనే వాణీదేవి వేచి ఉన్నా ఫలితం లేకపోయింది. నామినేషన్ల స్వీకరణ సమయం అయిపోవడంతో ఆమె వెనుదిరగక తప్పలేదు.
మంగళవారం వాణీదేవి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. టీఆరెస్ అసలు ఈ స్థానం నుండి పోటీచేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అనూహ్యంగా వాణీదేవి పేరు తెరపైకి వచ్చింది.