అధికార టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో 80శాతం ఉద్యోగాలను ఇప్పటికీ స్థానికేతరులే కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని ఆరోపించారు. స్థానిక రిజర్వేషన్లను ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసిందన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే… కేంద్రానికి లేఖలు రాస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే మౌనం పాటిస్తున్నారని, దీని వల్ల తెలంగాణలో ఉన్న కృష్ణా నది ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం కాబోతుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 450టీఎంసీల నీరు వినియోగించుకునే అవకాశం ఉన్నా సర్కారుకు ప్రణాళికలు లేవని దుయ్యబట్టారు.