టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, టీఆరెఎస్ అధినేత మద్య ఎం జరిగింది…? కేకే కేసీఆర్‌కు చెప్పకుండానే చర్చలకు ఆహ్వనించి వెనక్కి తగ్గారా..? కేకే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా…? కేసీఆర్-కేకే మద్య అసలేం జరిగింది…?
టీఆర్ఎస్‌లో కేసీఆరే సుప్రీం. ప్రభుత్వంలోనూ కేసీఆరే… కానీ సీనీయర్ లీడర్ మద్యలో వచ్చారు. ఆర్టీసీ సమ్మె విషయంలో మాటల్లేవ్-మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ కుండబద్దలు కొట్టిన సీఎం, అంతే కటువుగా ఉంటూ వచ్చారు. అటు ఆర్టీసీ సంఘాలు కూడా అంతే కటువుగా ఉంటూ రావటంతో సమ్మె జఠిలం కావటం, టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో, ఉద్యోగ సంఘాలు… కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
అయితే, హఠాత్తుగా కేకే అధికారికంగా మద్యవర్తిత్వానికి, చర్చలకు ఆహ్వనించారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ ఒకే రోజులో కేకే మాట మార్చారు. పైగా కేసీఆర్ పై నేరుగా నిందలేశారు. కేసీఆర్ టైం దొరకటం లేదు, మాట్లాడేందుకు అందుబాటులో లేరని. దీంతో… కేకే-కేసీఆర్ మద్య ఎం జరుగుతోంది, కేకే ఎందుకలా సీఎంను కాదని ప్రకటన ఇచ్చారా, అందుకే కేసీఆర్ మొఖం చాటేశారా అని ఇంటా బయట ఒకటే చర్చ.
అయితే, టీఆర్ఎస్ సీనీయర్ నేతల సమాచారం బట్టి… కేకే బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. కేకే బీజేపీ గూటికి వెళ్లే క్రమంలో… కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలన్న ఎత్తుగడతోనే చర్చల అంశాన్ని లేవనెత్తారని, సక్సెస్ కూడా అయ్యారని… కేసీఆర్‌ను దోషిగా నిల్చోబెట్టారని ప్రచారం నడుస్తోంది. డిల్లీలో కేకేకు మంచి లాబీయింగ్ ఉంది. కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ నేతగా చేసిన అనుభవం కూడా సొంతం. పైగా బీజేపీ రాష్ట్రంలో కార్మికోద్యమం నుండే బలపడాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే కార్మికోద్యమం నుండే కేకేను ముందుకు నడిపిస్తోందని, కేకే అతి త్వరలో పార్టీని వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది.