రెండు రోజుల బ్రేక్ తర్వాత సమావేశమైన పార్లమెంట్ సమావేశాల్లో అదే సీన్ కనిపిస్తోంది. లోకసభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి.. రైతులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు టీఆర్ఎస్ ఎంపీలు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకురావాలని నినదించారు. రాజ్యసభలోనూ ఇదే డిమాండ్ తో నిరసనకు దిగారు టీఆర్ఎస్ ఎంపీలు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు ఉభయసభల నుంచి వాకౌట్ చేశారు.
Also Read: బీజేపీలోకి చేరికలు.. డేట్ ఫిక్స్ చేసిన మల్లన్న
ఇటు పార్లమెంట్ కు నాగాలాండ్ కాల్పుల సెగ గట్టిగానే తగిలింది. రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని బీజేపీ ఎంపీలు చెప్పినా.. వెంటనే మాట్లాడాలని విపక్షాలు పట్టబట్టాయి. ఈ క్రమంలో లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు నిరసనకు దిగాయి. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
Also Read: మంత్రిగారు.. మీది మాట తప్పని ప్రభుత్వమా? ఇక్కడో లుక్కేయండి