గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ లేదు. అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఎక్స్ అఫిషియో స్థానాలు ఉన్నప్పటికీ మేయర్ స్థానంకు కావాల్సిన మెజారిటీ లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్పోరేటర్లకు గాలం వేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కో కార్పోరేటర్ కు 5కోట్లు ఇస్తాం అని మభ్యపెడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదరాబాదరగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్, మేయర్ ఎన్నికను మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తైన వెంటనే ఎన్నికల కమిషన్ గెజిట్ ఇవ్వకుండా ఆపుతుందని ఇప్పటికే బీజేపీ ఆరోపించగా, తమ కార్పోరేటర్లతో చార్మినార్ భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా ప్రమాణం కూడా చేయించారు. ఈ విషయాలన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు… తమ కార్పోరేటర్లను మభ్యపెడుతారని బీజేపీ అనుమానిస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే 5కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.