దాసోజు శ్రవణ్
రైతు నాయకుడినని చెప్పుకునే కెసిఆర్ రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటె రైతుల నడ్డి విరిచే వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం కొరకు ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అధికార టీఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రేమ ఉంటే పంజాబ్ తరహాలో కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల్ని తిరస్కరించి కొత్త వ్యవసాయ బిల్లును ఆమోదించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. పంజాబ్ ప్రభుత్వం కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సకాలం లో స్పందించి కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో నూతన బిల్లులను ఆమోదించింది.కేంద్ర వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలనే లక్ష్యం తో మూడు కొత్త వ్యవసాయ బిల్లులను తీసుకవచ్చింది.ఆ బిల్లులతో కొత్త విధి విధానాలు రూపొందించింది. చిన్న మరియు అట్టడుగు వర్గాల భూముల రక్షణ కొరకు మరో బిల్లును కూడా పంజాబ్ ప్రభుత్వం ఆమోదించింది.
కనీస మద్దతు ధరతో వివిధ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడానికి ధరల భరోసా మరియు వ్యవసాయ సేవలపై రైతుల సాధికారత మరియు రక్షణ ఒప్పందంపై ప్రత్యేక నిబంధనలతో పంజాబ్ సవరణబిల్లు 2020 ని రాష్ట్ర శాసనసభ ఆమెదించింది. గత ఏడు సంవత్సరాలుగా తెరాస పార్టీ కేంద్రం లో గల మోడీ రైతు వ్యతిరేక,వినియోగదారుల వ్యతిరేక విధానాలకు మద్దత్తు ఇస్తోంది.కరెన్సీ రద్దు,GST,ట్రిపుల్ తలాక్ లాంటి అనేక విషయాల్లో మీరు కేంద్రానికి మద్దత్తు ఇచ్చారు.మరియు మీరు నిర్బంధ వ్యవసాయం చేయాలనీ భయబ్రాంతులకుగురిచేస్తున్నారు.మరియు కేంద్ర వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతుల నడ్డి విరుస్తున్నారు. మోడీ కి భయపడి కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేయలేకపోతున్నారు. కొత్త వ్యవసాయ బిల్లులను రూపొందించడానికి భయపడుతున్నారు.ముఖ్యమంత్రి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర రైతువ్యతిరేక చట్టాలను నిరోధించడానికి కొత్త చట్టాలను రూపొందించాలి. తెలంగాణ రైతులు చాలా తెలివైన వారు, మీ యొక్క రాజకీయ నాటకాలను అర్థం చేసుకోగలరు.