కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. మద్యాహ్నాం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో ఈ భేటీ జరగనుంది. గ్రేటర్ ఎన్నికలు, మేయర్ ఎవరు అన్న అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీఆరెఎస్ ఎమ్మెల్యేలూ పాల్గొననున్నారు.
ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్… మేయర్ అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయించనుంది. ఈసారి మేయర్ పదవి మహిళకు రిజర్వ్ కావటంతో పోరు ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరుపున 27మంది మహిళలు గెలవగా… పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
రేసులో ఉన్న మేయర్ అభ్యర్థులు వీరే
భారతీ నగర్ కార్పోరేటర్ సింధురెడ్డి
ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి
చర్లపల్లి కార్పోరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
తార్నాక కార్పోరేటర్ మోతే శ్రీలత
డిప్యూటీ మేయర్ గా మరోసారి బాబా ఫసియుద్ధీన్ కే అవకాశం దక్కనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.